kala vankatrao: రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం: కళా వెంకట్రావు

  • ఆంక్షలతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరు
  • శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు
  • రైతులపై కేసులు ఎందుకు పెడుతున్నారు?
  • నియంతల్లా అణచివేతకు పాల్పడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వెంకటపాలెం, ఉద్ధండరాయుని పాలెం, మందడం గ్రామానికి చెందిన పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై టీడీపీ నేత కళా వెంకట్రావు స్పందించారు.

'రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. ఆంక్షలతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరు. శాంతి యుతంగా నిరసన చేస్తోన్న రైతులపై కేసులు ఎందుకు పెడుతున్నారు? నియంతల్లా అణచివేతకు పాల్పడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. పగ, ప్రతీకారం, విద్వేషం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు' అని కళా వెంకట్రావు విమర్శించారు.
kala vankatrao
Telugudesam

More Telugu News