మా నాన్న మళ్లీ గెలిస్తే, వైట్ హౌస్ లో ఉండబోను: ఇవాంకా ట్రంప్
- వచ్చే సంవత్సరంలో అమెరికాలో ఎన్నికలు
- ప్రస్తుతం తండ్రికి సలహాదారుగా ఉన్న ఇవాంకా
- ఇకపై పిల్లల గురించి ఆలోచిస్తానంటున్న ఇవాంకా
తన విధుల ప్రభావం వారి జీవితాలపై ఉండకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలిపారు. గత రెండున్నరేళ్లుగా తాను ప్రయాణిస్తూనే అత్యధిక సమయం గడిపానని, దేశం కోసం సేవ చేశానని, ఇప్పుడు తన పిల్లలు వారి అవకాశాలను వెతుక్కునేందుకు సహకరిస్తానని అన్నారు. ఇదే సమయంలో తండ్రికి సలహాదారుగా తాను చాలా చేశానని, అయినా, ఇంకా తన పని పూర్తి కాలేదనే భావిస్తున్నానని అన్నారు. రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదంటూనే, తన భర్త జారెడ్ కుష్ నర్ తో కలిసి పిల్లలను చూసుకుంటూ ఉండటమే ఇష్టమని 38 ఏళ్ల ఇవాంక వ్యాఖ్యానించారు.