నా దగ్గర డబ్బుల్లేవు.. ఆ టెన్షన్ నాకు పెట్టొద్దు: జగ్గారెడ్డి

  • కౌన్సిలర్ల టికెట్ల విషయంలో జోక్యం చేసుకోను
  • నా భార్యకు కూడా నేను టికెట్ ఇవ్వను
  • ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా గెలవాలి
కౌన్సిలర్ల టికెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోబోనని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జి, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలసి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. తన భార్యకు కూడా తాను టికెట్ ఇవ్వనని... ఆమెకు ఇవ్వాలా, వద్దా అనేది కూడా మీరే నిర్ణయించాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసినవారంతా గెలిచి రావాలని... గెలవకపోతే ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఉండదని అన్నారు. టికెట్ మిస్ అయిన వారికి కోఆప్షన్ మెంబర్ గా అవకాశం ఇస్తామని చెప్పారు. తన దగ్గర డబ్బులు లేవని... ఎవరికీ తాను డబ్బు ఇవ్వలేనని... డబ్బుల టెన్షన్ తనకు పెట్టొద్దని కోరారు. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

Go Back to Shorts
Jaggareddy
Sangareddy
Congress

More Telugu News