సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అవార్డును అంకితం ఇచ్చిన కీర్తి సురేశ్ 
  • చిరంజీవి, కొరటాల సినిమా అప్ డేట్ 
  • హైదరాబాదులో 'దర్బార్' ప్రీ రిలీజ్ వేడుక  
 *  'మహానటి' చిత్రంలోని అభినయానికి గాను ఇటీవల తాను అందుకున్న జాతీయ ఉత్తమ నటి అవార్డును సావిత్రికి అంకితం చేస్తున్నట్టు కథానాయిక కీర్తి సురేశ్ ప్రకటించింది. 'సావిత్రి అమ్మ ఆశీస్సుల వల్లే ఇదంతా జరిగింది. అందుకే ఆ అమ్మకే ఈ అవార్డును అంకితం చేస్తున్నాను' అని చెప్పింది కీర్తి.  
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రం షూటింగ్ వచ్చే నెల 3 నుంచి జరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది.
*  రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'దర్బార్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జనవరి 9న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 3న హైదరాబాదు శిల్ప కళా వేదికలో నిర్వహిస్తారు. దీనికి రజనీకాంత్ కూడా హాజరవుతారు.
Go Back to Shorts
Keerthi Suresh
Chiranjeevi
Koratala Shiva
Rajanikanth

More Telugu News