హీరోగా ఎంట్రీ ఇస్తాను .. కథలు వింటున్నాను: హైపర్ ఆది
- 'సుడిగాలి' సుధీర్ అంటే అభిమానం
- సుధీర్ హీరో కావడం ఆనందంగా వుంది
- అలాంటి కథలను ఎంచుకుంటానన్న ఆది
సుధీర్ హీరో కావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. తాను తప్పకుండా సక్సెస్ అవుతాడనే నమ్మకం వుంది. త్వరలో నేను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. నాకు పాటలు .. ఫైట్లు అంతగా సెట్ కావు, ఒకవేళ చేస్తే అవి కూడా కామెడీగా అనిపిస్తాయి. అందువలన పాటలు .. డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను .. మంచి కథ దొరకాలంతే" అని చెప్పుకొచ్చాడు.