హీరోగా ఎంట్రీ ఇస్తాను .. కథలు వింటున్నాను: హైపర్ ఆది

  • 'సుడిగాలి' సుధీర్ అంటే అభిమానం 
  • సుధీర్ హీరో కావడం ఆనందంగా వుంది 
  •  అలాంటి కథలను ఎంచుకుంటానన్న ఆది 
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పాప్యులర్ అయ్యారు. అలాంటివారి జాబితాలో హైపర్ ఆది ముందు వరుసలో కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ .." సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారిగా మా పరిచయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ తరువాత ఇద్దరం కలిసి కొన్ని స్కిట్స్ చేశాము.

సుధీర్ హీరో కావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. తాను తప్పకుండా సక్సెస్ అవుతాడనే నమ్మకం వుంది. త్వరలో నేను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం వుంది. నాకు పాటలు .. ఫైట్లు అంతగా సెట్ కావు, ఒకవేళ చేస్తే అవి కూడా కామెడీగా అనిపిస్తాయి. అందువలన పాటలు .. డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను .. మంచి కథ దొరకాలంతే" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Hyper Aadi
Sudheer

More Telugu News