విజయవాడ బందరు రోడ్డులో ఉద్రిక్తత: రాజధానిని తరలించొద్దంటూ చేపట్టిన ర్యాలీ భగ్నం

  • అనుమతి లేదంటూ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, అమరావతి పరిరక్షణ సమితి నేతల మధ్య వాగ్వాదం
  • రాజధానిని అమరావతిలోనే  కొనసాగించేందుకు సహకరించాలని పోలీసులకు వినతి
రాజధానిని తరలించొద్దంటూ విజయవాడ బందరు రోడ్డులో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కాగడాల ర్యాలీకి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాగడాల ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో పోలీసులు, అమరావతి పరిరక్షణ సమితి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

రాజధానిని అమరావతిలోనే  కొనసాగించేందుకు సహకరించాలని పోలీసులను అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కోరారు. అంతకుముందు అమరావతి పరిరక్షణ సమితి నేతలు విపక్ష నేతలతో భేటీ అయ్యారు. రాజధానిని తరలించవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చారు.    

Go Back to Shorts
shifting of capital
protest from Amaravati Parirakshna samiti

More Telugu News