ఎన్నార్సీ విషయంలో మోదీ చెప్పింది నిజమే: అమిత్ షా
- ఎన్నార్సీపై ఇంత వరకు చర్చ జరగలేదు
- కేబినెట్లో కానీ, పార్లమెంటులో కానీ చర్చించలేదు
- దీనిపై డిబేట్ అనవసరం
ఇటీవల అసోంలో నిర్వహించిన పౌర జాబితా నేపథ్యంలో, కొత్త జాబితా నుంచి ఏకంగా 19 లక్షల మంది తొలగింపబడ్డారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. ఈ చట్టం ముస్లింలను టార్గెట్ చేసేలా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.