ఏజేఎస్యూతో పొత్తు పెట్టుకుని ఉండుంటే... ఇప్పుడు బాధపడుతున్న బీజేపీ!
- పొత్తుంటే 40 సీట్లు వచ్చుండేవి
- కాంగ్రెస్ కూటమికి 34 సీట్లే
- ఓట్ షేరింగ్ డేటా విశ్లేషణ
ఎన్నికల ఫలితాల తరువాత ఓట్ షేరింగ్ డేటాను విశ్లేషిస్తుంటే పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ - ఏజేఎస్యూ కూటమికి 41.5 శాతం ఓట్లు వచ్చుండేవి. కాంగ్రెస్ కూటమి 35.4 శాతం ఓట్లకు పరిమితమయ్యేది. బీజేపీ కూటమి బరిలో ఉంటే బీజేపీకి అదనంగా 9 సీట్లు, ఏజేఎస్యూకు మరో 4 సీట్లు వచ్చుండేవి. ఇప్పుడు మాత్రం అత్యధిక ఓట్లను పొందినా, అధికారాన్ని బీజేపీ దక్కించుకోలేపోయింది.