జగన్ పాలన బాగుంటుందని అనుకున్నా!: సీపీఐ నారాయణ
- గత ప్రభుత్వ తరహాలోనే జగన్ ప్రభుత్వం కూడా నడుస్తోంది
- వచ్చిన అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవాలి
- లేకపోతే రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది
జగన్ కు ఎంతో భవిష్యత్తు ఉందని... వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరే పాలిస్తామంటే... రానున్న రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే... వారి ఆలోచనల మేరకు అధికారులు పని చేస్తారని నారాయణ చెప్పారు. గత ఎన్నికలకు ముందు టీడీపీని అణగదొక్కేందుకు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి బీజేపీ ప్రభుత్వం సీఎస్ పదవిని కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు.