ఝార్ఖండ్ విచిత్రం... ఓట్ షేరింగ్ లో అందనంత ఎత్తున ఉన్న బీజేపీ... అయినా దక్కని అధికారం!
- అధికారంలోకి కాంగ్రెస్ - జేఎంఎం కూటమి
- బీజేపీకి 33.37 శాతం ఓట్లు
- కాంగ్రెస్, జేఎంఎంలకన్నా అధికమే
పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాలను పరిశీలిస్తే, బీజేపీ - 33.37 శాతం, జేఎంఎం - 18.75 శాతం, కాంగ్రెస్ 13.88 శాతం, ఏజేఎస్యూపీ - 8.10 శాతం, జేవీఎం - 5.45 శాతం, ఆర్జేడీ - 2.75 శాతం, నోటాకు 1.36 శాతం ఓట్లు లభించగా, మిగతావి ఇతర పార్టీలకు పడ్డాయి. జేఎంఎం, కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ కలిపినా కూడా బీజేపీకి వచ్చిన ఓట్లతో సమానం కాకపోవడం గమనార్హం.