డిసెంబర్ 31కి... నేను రెడీ... మీరు రెడీయా?: యాంకర్ శ్రీముఖి వీడియో!
- ఈ సంవత్సరం విశాఖలో ఉంటాను
- ఎంజీఎం గ్రౌండ్స్ లో జరిగే ఈవెంట్ కు వెళుతున్నా
- సెలబ్రేషన్స్ కు సిద్ధం కావాలన్న శ్రీముఖి
మాన్యం హాస్పిటాలిటీస్ నిర్వహిస్తున్న 'బిగ్ బజ్' అనే కార్యక్రమంలో పాల్గొంటున్నానని, అక్కడికి వస్తే న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతూ అందరమూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అంటూ, ఓ వీడియోను విడుదల చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది. అన్నట్టు ఈ కార్యక్రమానికి వెళ్లాలంటే టికెట్ కొనుక్కోవాల్సిందే. ఆ విషయాన్ని కూడా చెబుతూ, వెంటనే టికెట్లు బుక్ చేసుకుని ఈవెంట్ కు రావాలని కోరింది శ్రీముఖి. ఆ వీడియోను మీరూ చూడండి.