అమృత తండ్రి మారుతీరావుకు మరోమారు బెయిల్ మంజూరు
- పరువు హత్య చేయించిన మారుతీరావు
- బెయిల్ పై బయటకు వచ్చి కుమార్తెకు బెదిరింపులు
- అరెస్ట్ చేసి జైలుకు పంపగా, షరతులతో రెండోసారి బెయిల్
ఈ ఘటనపై అమృత మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారుతీరావును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మారుతీరావు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 20 వేల షూరిటీ, రెండు నెలల పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పోలీసు స్టేషన్ కు హాజరై, సంతకం చేయాలని షరతులు విధించి, మరోమారు ఇటువంటి బెదిరింపులు చేయరాదని హెచ్చరిస్తూ, న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.