తెలంగాణలో ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు లంచగొండి ఉద్యోగులు
- హైదరాబాద్‌లో ఇద్దరు.. వరంగల్‌లో ఒకరు
- ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు రూ.40 వేలు లంచం అడిగిన కంప్యూటర్ ఆపరేటర్
- జీఎస్టీలో పేరు నమోదుకు రూ.5 వేలు లంచం అడిగిన ఉప వాణిజ్య పన్నుల అధికారిణి
సికింద్రాబాద్‌లోని మౌలాలికి చెందిన గ్యార రాజకుమార్ అనే వ్యక్తి జీఎస్టీలోని తన చిరునామా మార్చాలని నాచారంలోని సర్కిల్-2 ఉప వాణిజ్య పన్నుల అధికారి ధీరావత్ సరోజను కలిశాడు. అడ్రస్ మార్చేందుకు ఆమె రూ.5 వేల లంచం డిమాండ్ చేయగా, అది పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులుకు నిలువునా దొరికిపోయింది.
మరో ఘటనలో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు ఇన్‌చార్జ్ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) రైతు నుంచి రూ.7500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి, చివరికి రూ. 7,500కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.