పూడిక తీస్తుంటే బయటపడిన టూ వీలర్... ఆశ్చర్యపోయిన జీహెచ్ఎంసీ అధికారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూడిక తీస్తుంటే బయటపడిన టూ వీలర్... ఆశ్చర్యపోయిన జీహెచ్ఎంసీ అధికారులు!

  • హైదరాబాద్ లో నాలా పూడికతీత పనులు
  • బయట పడిన హీరో హోండా ఫ్యాషన్ బైక్
  • సంబంధిత వ్యక్తికి అందిస్తామన్న అధికారులు
హైదరాబాద్ లోని నాలాలో పూడికతీత పనులు చేపట్టిన అధికారులు, కాలువ నుంచి ద్విచక్ర వాహనం బయట పడటంతో ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ముషీరాబాద్ పరిధిలో జరిగింది. ఇక్కడి బాప్టిస్టు చర్చి వీధిలో నిన్న అధికారులు నాలాలో పూడికతీత పనులు చేపట్టారు. జేసీబీ యంత్రాలను తెప్పించి, నాలా నుంచి వ్యర్థాలను వెలికి తీస్తున్నవేళ, హీరో హోండా ఫ్యాషన్‌ (ఏపీ 09 ఈఈ 7703) బైక్ బయటకు వచ్చింది.

 దీన్ని చూసిన డీఈ ప్రసాద్‌, ఏఈ తిరుపతిలు, వాహనం గురించి ఆరా తీశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల క్రితం భారీ వర్షాలు పడినప్పుడు ఈ బైక్ నాలాలో పడి కొట్టుకుపోయిందని, ఈ విషయమై సదరు వ్యక్తి నుంచి ఫిర్యాదు కూడా అందిందని చెప్పారు. వాహనాన్ని సంబంధిత వ్యక్తికి అందిస్తామన్నారు. నాలాలో టూ వీలర్ బయట పడిందని తెలుసుకున్న పలువురు స్థానికులు, చూసేందుకు అక్కడికి తరలివచ్చారు.
GHMC
Honda
Passion

More Telugu News