దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం: అసదుద్దీన్ ఒవైసీ
- ఎన్ఆర్సీ అమలు చేస్తే రాష్ట్రాలు ఖాళీ అవుతాయి
- ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలి
- ఏడు దశాబ్దాల తర్వాత భారతీయులుగా నిరూపించుకోవాలా?
దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఒవైసీ అన్నారు. దేశంలోని ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలని అన్నారు. మహాత్మాగాంధీ మనమధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని, అంబేద్కర్ లేకపోయిన ఆయన రచించిన రాజ్యాంగం మనతో ఉందని అన్నారు. దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఒవైసీ స్పష్టం చేశారు.