టీటీడీ డైరీని చూసిన భక్తుల్లో తీవ్ర అసంతృప్తి!
- శ్రీవారి డైరీలకు ఎంతో డిమాండ్
- పేజీల్లో కనిపించని తిధులు, శుభ గడియలు
- క్వాలిటీ తగ్గిపోయిందని భక్తుల ఆగ్రహం
వాస్తవానికి బయట లభించే ఇతర డైరీలతో పోలిస్తే, టీటీడీలో శుభ ఘడియలు, గోవిందనామ కీర్తనలు ఉంటాయి. ప్రతి పేజీలోనూ తిథులు, నక్షత్ర వివరాలు, యమగండం, శుభలగ్నం, రాహుకాలం వంటివన్నీ ఉంటాయి. గోవింద నామాలు, భగవద్గీత సూక్తులు కనిపిస్తాయి. ఈ సంవత్సరం డైరీలో తిథులూ లేవు. క్వాలిటీ కూడా బాగాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో టీటీడీ ఇంకా స్పందించలేదు.