రవితేజతో కలిసి నటించాలని వుంది: సాయితేజ్
- మల్టీ స్టారర్ చిత్రాలపై స్పందించిన తేజు
- రవితేజ అలా అంటాడట
- ఇద్దరూ మాస్ ఇమేజ్ వున్న వాళ్లే
తనకి రవితేజతో కలిసి నటించాలని ఉందనే మనసులోని మాటను బయటపెట్టాడు. తను ఎదురైనప్పుడల్లా, 'మనిద్దరం కలిసి ఒక సినిమా చేయాలబ్బాయ్' అని రవితేజ గారు అంటూ ఉంటారని తేజు చెప్పాడు. 'మంచి కథ కుదిరితే ఆయనతో చేయాలని నాకు కూడా చాలా ఆసక్తిగా వుంది' అని అన్నాడు. ఈ ఇద్దరికీ మాస్ ఇమేజ్ పుష్కలంగా వుంది .. ఎనర్జీ విషయంలో ఇద్దరూ ఇద్దరే. కనుక ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుందనే చెప్పొచ్చు.