: షిండేను విచారించాలని జైపూర్ కోర్టు ఆదేశాలు
'హిందుత్వ తీవ్రవాదం' అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను వెంటాడుతున్నాయి. వీటిపై బీజేపీ నేత సోమ్ దత్ పంచాల్ జైపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం షిండేను విచారించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చింది.