జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. సాంబారులో పడి చిన్నారి మృతి

  • గట్టులోని గురుకుల విద్యాలయంలో ఘటన
  • ఆడుకుంటూ వెళ్లి సాంబారు గిన్నెలో పడిన మూడేళ్ల చిన్నారి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. వేడివేడి సాంబారులో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచింది. గట్టులోని గురుకుల విద్యాలయంలో చిన్నతాండ్రపాడుకు చెందిన లక్ష్మి కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. మధ్యాహ్నం భోజనం వడ్డిస్తున్న సమయంలో లక్ష్మి విద్యార్థుల పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేస్తుండగా, ఆమె కుమార్తె రష్మిక (3) ఆడుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న వేడివేడి సాంబారు గిన్నెలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన లక్ష్మి కుమార్తెను బయటకు తీసి కర్నూలు ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ రష్మిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Jogulamba Gadwal District
girl

More Telugu News