రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది: సుజనా చౌదరి

  • అమరావతి విషయంలో ప్రభుత్వం లిఖితపూర్వక ప్రక్రియ మొదలుపెట్టాలి
  • అప్పుడు కేంద్రం పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటుంది
  • గందరగోళాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై బీజేపీ నేత సుజనా చౌదరి మరోసారి విమర్శలు గుప్పించారు. అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.  

రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని సుజనా చౌదరి అన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం లిఖితపూర్వక ప్రక్రియ మొదలుపెడితే అప్పుడు కేంద్రం పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జరుగుతున్న గందరగోళాన్ని ఇప్పటికే కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానంటూ ఆయన ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Sujana Chowdary
BJP
YSRCP

More Telugu News