అమరావతి ఒక పెద్ద స్కామ్: వైసీపీ నేత అంబటి రాంబాబు
- రాజధానిలో జరిగిన మోసాన్ని కచ్చితంగా బయట పెడతాం
- జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
- సహజంగానే జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు
- రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు
'రాజధానిలో జరిగిన మోసాన్ని కచ్చితంగా బయట పెడతాం. అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. రైతుల ముసుగులో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. జగన్ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారు' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
'మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందని అసెంబ్లీలో జగన్ చెప్పారు. జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదు. రాజధాని అంటే కేవలం నగరాల నిర్మాణం కాదు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు' అని అంబటి రాంబాబు అన్నారు.