'నిర్భయ' దోషి అక్షయ్ పిటిషన్ తిరస్కరణ.. ఉరిశిక్షను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు
- తీర్పు పునఃపరిశీలనకు ఎలాంటి ఆధారాలు లేవు
- స్పష్టం చేసిన త్రిసభ్య ధర్మాసనం
- త్వరలోనే దోషులకు ఉరి?
ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని అలాంటప్పుడు ఇంక మరణశిక్ష ఎందుకని అక్షయ్ తన పిటిషన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు వేసిన మరణశిక్ష తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్లో కోరాడు. అతడి రివ్యూ పిటిషన్ పై ఇంప్లీడ్ అయ్యేందుకు సుప్రీంకోర్టులో 'నిర్భయ' తల్లి కూడా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.