పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు
- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో 60 పిటిషన్లు
- కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ జనవరి 22కి వాయిదా
పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్, ఎంఐఎం అధినేత ఒవైసీ, ఇండియన్ ముస్లిం లీగ్, అసోం గణపరిషత్ సహా వివిధ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి.