ఏపీ శాసన సభ నుంచి తొమ్మిది మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  • అసెంబ్లీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చ
  • గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులు
  • సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై చర్చిస్తున్న సందర్భంలో తొమ్మిది మంది టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్ లను ఈ ఒక్కరోజుకి సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
Go Back to Shorts
Telugudesam
Mla`s
Suspension
speaker

More Telugu News