ఈవ్ టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయబోతే.. అర్ధనగ్నంగా మార్చిన దుండగులు
- యూపీలోని చౌరీచౌరా ప్రాంతంలో ఘటన
- నిందితులను అరెస్టు చేసిన యూపీ పోలీసులు
- పోస్కో, లైంగిక వేధింపులు చట్టాల కింద కేసు నమోదు
కొంతకాలంగా ఆ ఇద్దరు వ్యక్తులు బాలికను అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేసేవారని బాధితురాలు తమకు గతంలో తెలిపిందన్నారు. దీనిపై తాము నిందితులను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. వారు తిరిగి ఈవ్ టీజింగ్ కు పాల్పడటంతో బాలిక నిందితులపై ఫిర్యాదు చేయడానికి నిర్ణయించుకుందని.. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజే నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు సీఐ రచనా మిశ్రా తెలిపారు. వారిపై పోస్కో, లైంగిక వేధింపులు, హాని కలిగించడం, నిర్బంధించడం, ఆయుధాలతో దాడి చేయడం తదితర నేరాల కింద కేసు నమోదు చేశామన్నారు.