నెల రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి, కనిపించకుండా పోయిన కుటుంబం!
- గత నెల 11న శ్రీశైలం వెళ్లిన శ్రీధర్‌రెడ్డి కుటుంబం
- చివరిసారి ఈ నెల 5న కుటుంబ సభ్యులకు ఫోన్
- ఆ తర్వాతి నుంచి ఆచూకీ గల్లంతు
శ్రీశైలం వెళ్లిన వారు మూడు రోజుల వరకు హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నారు. చివరిసారి ఈ నెల 5న తల్లి జయమ్మకు ఫోన్ చేసిన శ్రీధర్‌రెడ్డి తాము శ్రీశైలంలోనే ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో తల్లి జయమ్మ ఆందోళన చెందింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.