నివేదిక వచ్చేసింది.. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో వెల్లడించిన నిపుణుల కమిటీ!
- ప్రమాదాలకు కారణాలు అన్వేషించేందుకు నిపుణుల కమిటీ
- మూలమలుపుల విషయాన్ని పట్టించుకోలేదు
- వాహనాల వేగం 40 కిలోమీటర్లకు మించకుండా స్పీడ్‌బ్రేకర్లు
నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలో వంతెన డిజైన్, నాణ్యత, ఇతర అంశాల గురించి పేర్కొన్నారు. వంతెన నిర్మాణంలో ఇంజనీర్లు మరింత ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రమాణాల ప్రకారమే వంతెన నిర్మాణం జరిగినప్పటికీ మలుపుల విషయంలో ఎదురయ్యే దుష్పరిణామాలను పక్కనపెట్టారని పేర్కొంది.
బ్రిడ్జిపై వేర్వేరు చోట్ల, ఎత్తుల్లో వేగాన్ని నిరోధించేందుకు రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది. వంతెనపై సెల్ఫీలు తీసుకోకుండా మూల మలుపు దగ్గర క్రాష్ బారియర్స్‌పై 1.5 మీటర్ల ఎత్తున పరదా లాంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. నివేదికలో సూచించిన చర్యలు పూర్తయిన తర్వాత నిపుణుల కమిటీ మరోమారు వంతెనను పరిశీలిస్తుంది. అనంతరం వంతెన ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.