ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ సస్పెన్షన్ పై స్టే విధించిన ‘క్యాట్’

  • నాలుగు రోజుల క్రితం కృష్ణకిశోర్ సస్పెన్షన్  
  • దీనిని సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించిన వైనం 
  • స్టే విధించడంతో కృష్ణకిశోర్ కు ఊరట 
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ‌కిశోర్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాట్ ను ఆశ్రయించిన కృష్ణ కిశోర్ కు ఊరట లభించింది. తనపై విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన క్యాట్ ‘స్టే’ విధించింది. కాగా, నాలుగు రోజుల క్రితం కృష్ణ కిశోర్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో ఏపీఈడీబీ సీఈఓగా పని చేసిన కృష్ణ కిశోర్ కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది.
Go Back to Shorts
IRS
Krishna kishore
CAT
Andhra Pradesh

More Telugu News