జామియా వర్శిటీలోకి వెళ్లేందుకు పోలీసులకు అనుమతి ఎవరిచ్చారు?: గులాం నబీ ఆజాద్
- పోలీసుల తీరు అమానవీయం
- వర్శిటీలోకి వెళ్లి విద్యార్థుల వెంటబడ్డారు
- ఈ ఘటనలకు ప్రధాని, మంత్రి వర్గం పూర్తి బాధ్యత వహించాలి
వర్శిటీలోకి వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానవీయంగా ఉందని, పోలీసులు విద్యార్థుల వెంటబడ్డారని మండిపడ్డారు. నిన్న ఢిల్లీ యూనివర్శిటీలో తీవ్రమైన ఆందోళనలు జరిగాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ ఘటనలకు ప్రధాని సహా మొత్తం మంత్రి వర్గం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేసి బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.