అవన్నీ వదంతులే.. ఆందోళనల్లో మా వాళ్లెవరూ ప్రాణాలు కోల్పోలేదు: జామియా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రకటన
- ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం
- విశ్వవిద్యాలయ క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించారు
- వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతాం
'మా వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని వదంతులు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. మా విద్యార్థులు ఎవరూ చనిపోలేదు. ఈ ఆందోళనల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది మా విద్యార్థులే ఉన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించడంపై మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతాం. ధ్వంసమైన ఆస్తులను తిరిగి నిర్మించుకోవచ్చు. కానీ, విద్యార్థుల ఆందోళనలకు మీరు విలువ కట్టలేరు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం' అని తెలిపారు.