ఆరుగురిపై పరువునష్టం దావా వేయబోతున్నాం: రామ్ గోపాల్ వర్మ
- తమ సినిమాపై కేసులను కోర్టు కొట్టేసింది
- అయినా కొందరు సినిమా విడుదలను అడ్డుకున్నారు
- రూ. 20 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నాము
తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని... టైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ తెలిపారు. కేసులను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం, విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తమకు నష్టం జరిగిందని చెప్పారు. ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని అన్నారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు. వీరందరిపైనా రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.