హైదరాబాద్‌కూ తాకిన పౌరసత్వ చట్టం నిరసన సెగలు.. విద్యార్థుల ఆందోళన
- రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపిన ‘మను’, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు
- కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసన
‘మను’ విద్యార్థులు గతరాత్రి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలతో ఆందోళనకు దిగారు. మరోవైపు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాత్రి 11:30 గంటల సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.