Telugudesam: చంద్రబాబు మాటలను మార్ఫింగ్ చేసిన వైసీపీకి సిగ్గులేదు: నక్కా ఆనంద్ బాబు

  • చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణం
  • అబద్ధాన్ని నిజం చేయాలని అధికారపక్షం చూస్తోంది
  •  అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగత దూషణల కోసం  నిర్వహిస్తున్నట్లుంది
ప్రతిపక్ష నేత చంద్రబాబును మార్షల్స్ అడ్డుకోవడం దారుణమని, దుర్భాషలాడారంటూ బాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని టీడీపీ నేతలు అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, చంద్రబాబు మాటలను వైసీపీి సిగ్గులేకుండా మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. అబద్ధాన్ని నిజం చేయాలని అధికారపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు కాకుండా వ్యక్తిగత దూషణల కోసం  నిర్వహిస్తున్నట్లుందని విమర్శించారు.
Telugudesam
Nakka Anandababu
YSRCP

More Telugu News