జార్జియాలో లైవ్ లో మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి పారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్!
- షాక్ అయిన జర్నలిస్టు
- జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఘటన
- ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమన్న పోలీసులు
ఓ వ్యక్తి మాత్రం ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్ ను కొనసాగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చర్యకు పాల్పిన వ్యక్తిని థామస్ కల్లావె(43) గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చర్యలను తాము ఉపేక్షించబోమని పోలీసులు తెలిపారు.
నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. వీఎస్ఏవీ టీవీ జర్నలిస్టు అలెక్స్ బోజర్జియాన్ పై థామస్ పాల్పడిన ఈ చర్యకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు.