ప్రముఖ హీరో రామ్చరణ్ చితాల్రపై ‘మెగా’ కాంపిటీషన్
- రామ్ చరణ్ నటించిన చిత్రాల్లో ఏది నచ్చింది?
- ఏ చిత్రంలోని పాత్ర మనసుకు దగ్గరైంది?
- విశ్లేషణాత్మక వ్యాసం రాసి ఈ నెల 20 లోపు పంపాలి
- అఖిల భారత చిరంజీవి యువత ప్రకటన
మెగా అభిమానులు తమ విశ్లేషణాత్మక కథనాలను ఈ నెల 20వ తేదీలోగా హైదరాబాద్లోని CCT కార్యాలయానికి పంపాలని లేదా [email protected]కు మెయిల్ చేయాలని కోరారు. ఈ కాంపిటీషన్లో మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తమ రచనల ద్వారా సలహాలు, సూచనలు, విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది.
ఈ కాంపిటీషన్ లో గెలుపొందిన వారికి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపింది. ఉత్తమ రచనలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేయనున్నట్టు వివరించింది.