ఉల్లి ధరల పెంపుపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నిరసన.. ఉల్లిమాలలు ధరించి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన
- కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన పుదుచ్చేరి సీఎం
- ప్రజావసరాల కంటే స్వప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని విమర్శలు
- ధరల పెంపుతో వేడుకలు కూడా రద్దవుతున్నాయని ఆవేదన
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు తీర్చడం కంటే స్వప్రయోజనాలపైనే బీజేపీ దృష్టిపెట్టిందన్నారు. బంగారం ధరలు పెరిగితే ఎవరికీ ఇబ్బంది లేదని, కానీ పెరిగిన ఉల్లిధరల వల్ల దేశ ప్రజలు మొత్తం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరల పెరుగుదలతో శుభకార్యాలు కూడా రద్దవుతున్నాయని నారాయణస్వామి అన్నారు.