తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

  • వారాంతపు రద్దీ మొదలు
  • 31 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 20 గంటలకు పైగా సమయం
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వారాంతం సమీపించడం, రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో ఒక్కసారిగా భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో శుక్రవారం నాటి దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్ల కోటా గంటల వ్యవధిలో ముగిసింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండగా, వీరికి 20 గంటల తరువాతే దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండున్నర నుంచి మూడు గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. గురువారం నాడు శ్రీవారిని 66,714 మంది భక్తులు దర్శించుకున్నారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
Piligrims
Rush

More Telugu News