వెంకటేశ్ 75వ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్
- వెంకీ తాజా చిత్రంగా రానున్న 'వెంకీమామ'
- తదుపరి చిత్రంగా 'అసురన్' రీమేక్
- వెంకీ 75వ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి
ఈ నేపథ్యంలో సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వెంకటేశ్ 75వ సినిమాను గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు తరుణ్ భాస్కర్ వినిపించిన ఒక కథకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందువలన ఆయన 75వ సినిమా తరుణ్ భాస్కర్ తోనే ఉండొచ్చునని కొందరు అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' తరువాత అనిల్ రావిపూడి వెంకటేశ్ తో 'ఎఫ్ 3' చేయాలనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ కారణంగా తన 75వ సినిమాను ఆయనతో చేయడానికే వెంకటేశ్ మొగ్గుచూపుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.