'ఏపీ దిశ యాక్ట్'కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం.. అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే!
- మహిళలకు అండగా ఉండేందుకు నిర్ణయం
- ఏపీ క్రిమినల్ లా 2019 సవరణ బిల్లుకు ఆమోదం
- మొత్తం 21 రోజుల్లోగా తీర్పు వెలువరించాలి
మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్ట్ లు చేస్తే సెక్షన్ 354(ఇ) కింద చర్యలు చేపట్టనున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354(ఎఫ్) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే వారు, ఈ శిక్షను పెంచుతూ బిల్లులోని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.