ముంబైకి మకాం మారుస్తున్న రాశి ఖన్నా?

  • యూత్ లో రాశి ఖన్నాకి మంచి క్రేజ్
  • తెలుగులో అడపా దడపా అవకాశాలు 
  • హిందీ సినిమాల కోసం గట్టి ప్రయత్నాలు
తెలుగు తెరపై అందాల కథానాయికగా మార్కులు కొట్టేసినవారిలో రాశి ఖన్నా ఒకరుగా కనిపిస్తుంది. కెరియర్ ఆరంభం నుంచి కూడా పెద్దగా హడావిడి పడిపోకుండా తాపీగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అప్పుడప్పుడు పలకరించే హిట్స్ తోనే ఇక్కడ కెరియర్ ను నెట్టుకొస్తోంది.

ఆ మధ్య తెలుగులో కెరియర్ కాస్త ఆశాజనకంగా కనిపించడంతో, 'గచ్చిబౌలీ'లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో, కోలీవుడ్ పై కూడా ఒక లుక్కేసింది. అక్కడ కూడా ఒక్కొక్కటిగా అవకాశాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాశి ఖన్నా ముంబైకి మకాం మార్చేయాలనే నిర్ణయానికి వచ్చేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'గచ్చిబౌలి'లోని ఇంటిని కూడా ఆమె రెంట్ కి ఇచ్చేసిందని అంటున్నారు. ముంబైలో గట్టి ప్రయత్నాలు చేస్తూ, దక్షిణాది నుంచి వచ్చే అవకాశాలను కూడా అందుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుందట. బాలీవుడ్లో రాశి ఖన్నా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
Rasi Khanna

More Telugu News