తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

  • 3 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 4 గంటల సమయం
  • నిన్న 61 వేల మందికి దర్శనం
తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి నాలుగు గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న మంగళవారం నాడు స్వామివారిని 60,901 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,759 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.73 కోట్లుగా నమోదైంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
Piligrims
TTD

More Telugu News