నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ
- 2012లో నిర్మల్ లో బహిరంగ సభలో మాట్లాడిన అక్బరుద్దీన్
- వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు
- విచారణకు హాజరైన ఒవైసీ
ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ప్రసంగించారని ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన విచారణకు హాజరవుతున్నారు. నిర్మల్ లోని కోర్టుకు పోలీసుల భద్రత మధ్య వచ్చిన ఆయన విచారణ అనంతరం అక్కడి నుంచి వెళ్లారు.