ధన్యా బాలకృష్ణ నాతో సినిమా చేయనందట: 'సుడిగాలి' సుధీర్
- హీరోగా నా తొలి సినిమా 'సాఫ్ట్ వేర్ సుధీర్'
- హీరోయిన్ పాత్ర కోసం ధన్యాను సంప్రదించారు
- ఆ విషయాన్ని ఆమెనే నాకు స్వయంగా చెప్పిందన్న సుధీర్
'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ధన్యా బాలకృష్ణను సంప్రదిస్తే ముందుగా 'కొత్తవాళ్లతో చేయను .. కొంచెం పేరున్న వాళ్లతోనే చేస్తాను' అని చెప్పిందట. ఆ తర్వాత ఈ సినిమాలో నేను హీరోననే విషయాన్ని బెంగుళూరులోని వాళ్ల స్నేహితుల దగ్గర ప్రస్తావించిందట. వాళ్లంతా కూడా 'సుడిగాలి' సుధీర్ కి మంచి క్రేజ్ ఉందని అనడంతో ఆమె ఓకే చెప్పింది. ఈ విషయాన్ని తనే నాతో స్వయంగా చెప్పింది" అని అన్నాడు.