పూణేలోని ఆసుపత్రిలో అరుణ్ శౌరీని పరామర్శించిన మోదీ
- ఇటీవలే గాయపడ్డ అరుణ్ శౌరీ
- రూబీ హాల్ లో ఆసుపత్రిలో చికిత్స
- అరుణ్ శౌరీ ఆరోగ్యం గురించి మోదీ ఆరా
తమ మధ్య చక్కని చర్చ జరిగిందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యం పొందాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తన పోస్ట్ లో ఆకాంక్షించారు. కాగా, గత ఆదివారం రాత్రి లావాసాలోని తన నివాసంలో నడుస్తున్న అరుణ్ శౌరీ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఆయన తలకు గాయమైంది. పూణెలోని రూబీ హాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ శౌరీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.