రాత్రి 10 దాటితే అమ్మాయిలను ఉచితంగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తోన్న పోలీసులు

  • కర్ణాటకలోని గదగ్ లో పోలీసుల సేవలు
  • ఫోన్ చేస్తే వచ్చి డ్రాప్ చేస్తామంటోన్న పోలీసులు
  • మహిళలపై దాడుల నేపథ్యంలో నిర్ణయం
దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతోన్న దాడులు, అత్యాచారాల ఘటనలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీంతో కర్ణాటకలోని గదగ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 దాటితే ఉచితంగా మహిళలను వారి ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని తెలిపారు. నిన్నటి నుంచే ఈ సేవలు ప్రారంభించామని అన్నారు.

'మహిళలు ఏ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినా లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసినా ఈ సేవలు అందుతాయి. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి వారి వాహనంలో మహిళలను ఇంటి వద్ద ఉచితంగా డ్రాప్ చేస్తారు' అని గదగ్ ఎస్పీ శ్రీనాథ్ జోషి ఈ రోజు మీడియాకు తెలిపారు. నిన్న సాయంత్రం పలు ప్రాంతాలను వారు పరిశీలించి, మహిళల భద్రత విషయాన్ని పర్యవేక్షించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుకోవచ్చని చెప్పారు. 
Go Back to Shorts
Karnataka
Police

More Telugu News