ఉన్నావో బాధితురాలి చివరి మాటలివే!
- అప్పట్లో సంచలనం సృష్టించిన ఉన్నావో ఘటన
- తాజాగా బాధితురాలిపై దాడి
- కాలిన గాయాలతో బాధితురాలు మృతి
దీనిపై ఆమె సోదరుడు మీడియాతో మాట్లాడారు. "నా సోదరి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాను. ఆమె ఒక్కటే చెప్పింది... నన్ను బతికించండి. నాకు చనిపోవాలని లేదు. అయితే వాళ్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు. వారిని తప్పకుండా ఉరి తీయాల్సిందే.. అని చెప్పింది. వారిలో ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఆమెకు బదులిచ్చాను" అంటూ బాధితురాలి సోదరుడు వెల్లడించారు.