ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ చేసిన పోలీసులు
- దిశను హత్య చేసిన నిందితుల ఎన్ కౌంటర్
- తెల్లవారుజామున 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఎన్ కౌంటర్
- తెలంగాణ పోలీసులపై ప్రశంసలు జల్లు
ఈ నేపథ్యంలో, ఆత్మరక్షణ కోసం నిందితులను పోలీసులు కాల్చిచంపారు. ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. దుర్మార్గులను చంపిన తెలంగాణ పోలీసులపై దేశ నలు మూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మరోవైపు, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు బుల్లెట్లను రికవర్ చేశారు. మొత్తం 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గన్స్ ను క్లూస్ టీమ్ సీజ్ చేసింది.