Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా ఆయనను ఎక్కడ చంపారో నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లి చంపేయండి: 'దిశ' నిందితుడి భార్య

  • ఇటువంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి కదా? 
  • అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం  పెద్దతప్పు 
  • కోర్టు తీర్పు ఇవ్వకుండానే చంపేశారు 
దిశపై హత్యాచారానికి  పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో నిందితుడు చెన్న కేశవులు భార్య స్పందించింది. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఇటువంటి కేసులు దేశంలో చాలా ఉన్నాయి కదా. దిశ తన చెల్లికి ఫోన్ చేసే బదులు వేరే ఎవరికయినా (పోలీసులకు) ఫోన్ చేయొచ్చు కదా? ఒక అమ్మాయి కోసం నలుగురి ప్రాణాలు తీయడం తప్పు సర్.. ఇది పెద్దతప్పు' అని చెప్పింది.

'కోర్టు తీర్పు ఇవ్వకుండానే చంపేశారు సర్.. ఇంతగానం చేయడం తప్పు సర్. న్యాయం కాదిది అన్యాయం. మా ఆయనను ఎక్కడ చంపారో నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి చంపండి' అని ఆమె వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పు ఇచ్చాకే శిక్ష అమలు చేస్తే బాగుండేదని ఆమె అన్నారు.
Disha
Encounter
Hyderabad

More Telugu News