అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం... కన్నడనాట మొదలైన ఉప ఎన్నికల పోలింగ్!
- 15 నియోజకవర్గాలకు ఎన్నికలు
- చలి తీవ్రతతో మందకొడిగా పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు
ఈ ఉదయం చలి తీవ్రత అధికంగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించలేదు. బరిలోకి దిగిన ఎమ్మెల్యేల్లో పలువురు ఉదయాన్నే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుండగా, 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది.